: రాజ్ నాథ్ సింగ్ కు అటల్ బిహారీ వాజ్ పేయి కండువా కానుక
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాజ్ నాథ్ సొంత నియోజకవర్గం ఘజియాబాద్. అయితే ఈ ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గాన్ని మార్చుకుని, లక్నో నుంచి బరిలోకి దిగుతున్నారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇదే స్థానం నుంచి మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈసారి లక్నో నుంచి పోటీ చేస్తున్న రాజ్ నాథ్ కు వాజ్ పేయి అభినందనలు తెలుపుతూ కండువాను కానుకగా పంపించారు. లక్నో ప్రజలు తనను ఆదరిస్తారని రాజ్ నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.