: మోడీ ట్రైలర్ చూడలేదు... భవిష్యత్ లో చూడబోతారు: రేణుక సంచలన వ్యాఖ్యలు
హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గుజరాత్ లో వరుసగా ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని అందరూ అంటున్నారని, అంతకంటే ఎక్కువ సార్లు అసోం కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి గా పని చేశారని అన్నారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ పని చేశారని అన్నారు. అయితే గోద్రా అల్లర్ల గురించి తెలిసిన వారు, ఇష్రత్ జహాన్ హత్యోదంతం తెలిసిన వారు మోడీని సమర్థించరని అన్నారు. మోడీ గురించి ఎవరికీ తెలియదని, మోడీ ట్రైలర్ చూడలేదని, త్వరలోనే చూడబోతారని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అంటే మోడీని ప్రధానిగా ఆమె ఒప్పుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.