: తల్లీబిడ్డల సంక్షేమానికి పెద్దపీట : సీఎం


గర్భిణీ స్త్రీల ఆరోగ్యం.. పుట్టిన బిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంతో పుట్టేందుకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు.

తద్వారా మూడున్నర లక్షల మంది గర్భిణీ స్త్రీలకు అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పుట్టిన బిడ్డలు తక్కువ బరువుతో పుడితే చికిత్స అందించేందుకు ఆస్పత్రిల్లో పడకలను రెట్టింపు చేశామని వెల్లడించారు.  నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నివారణకు..తాగునీటి కల్పనకు వెయ్యి కోట్లు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. ఈ సభలో మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

  • Loading...

More Telugu News