: కేసీఆర్ ను కలిసిన ఆర్.నారాయణమూర్తి
ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్. నారాయణమూర్తి ఈరోజు హైదరాబాదులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలుసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాను కేసీఆర్ తో రాజకీయాల గురించి మాట్లాడలేదని నారాయణమూర్తి చెప్పారు. తాను కేవలం కేసీఆర్ కు అభినందనలు తెలపడానికి మాత్రమే వచ్చినట్టు ఆయన తెలిపారు. త్వరలో తాను రాజ్యాధికారం అనే సినిమాను నిర్మిస్తున్నట్లు నారాయణమూర్తి చెప్పారు.