: టీడీపీతో పొత్తు వద్దు: టీబీజేపీ జిల్లాల అధ్యక్షులు
ఓవైపు పొత్తుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ అగ్రనేత జవదేకర్ చర్చలు జరుపుతుంటే... మరో వైపు తెలంగాణలోని 10 జిల్లాల బీజేపీ అధ్యక్షులు సమావేశమయ్యారు. అనంతరం వారంతా కలసి జవదేకర్ కు ఓ లేఖ రాశారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోరాదంటూ లేఖలో వారు కోరారు. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ మద్దతు లేకుండానే గెలిచే సత్తా బీజేపీకి ఉందని తెలిపారు. తెలంగాణలో వాపును చూసుకుని టీడీపీ బలుపు అనుకుంటోందని చెప్పారు. తెలుగుదేశంతో పొత్తు వద్దని జాతీయ నేతలకు వివరిస్తామని తెలిపారు. టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపితే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.