: జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు: కోనేరు
బాబూ జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని వైఎస్సార్సీపీ నేత కోనేరు రాజేంద్రప్రసాద్ అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కోనేరు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేసిన జగ్జీవన్ రామ్ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు.