: 42 వేల కార్లను వెనక్కి రప్పించిన సాలెపురుగు


ఓ సాలెపురుగు 42 వేల కార్లను వెనక్కి రప్పించింది. అమెరికాలో ఉండే యెల్లో సాక్ స్పైడర్ అనే సాలెపురుగుకు ఇంధనంలోని హైడ్రోకార్బన్లంటే భలే ఇష్టం. దీంతో ఇది కార్లలోని ఇంధనం ట్యాంకుల లోకి దూరి గూళ్లు పెడుతోంది. వీటి కారణంగా ఇంధనం టాంకులో ఒత్తిడి పెరిగి టాంకు పగుళ్లు చూపే ప్రమాదముంది. దీంతో అమెరికాలో మజ్జా కంపెనీ 2010 నుంచి 2012 మధ్య ఉత్పత్తి చేసిన వెంట్ హౌస్ విభాగానికి చెందిన 42 వేల కార్లను వెనక్కి రప్పించింది. కాగా 2011 లో ఈ సాలె పరుగు గూళ్లు కట్టడం గమనించిన కంపెనీ కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. కానీ పురుగు టాంకు లోపలికి ప్రవేశించి గూడు కట్టేస్తోంది. దీంతో మజ్జా కంపెనీ అన్ని కార్లను ఉపసంహరించుకుంది.

  • Loading...

More Telugu News