: సెల్ బ్యాలెన్స్ ఆఫర్ అంటూ ఓటర్లకు వల
ఎన్నికల ప్రచారం సాగించడానికి రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తులు వేస్తున్నాయి. అలాగే, యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి సెల్ ఫోన్ బ్యాలెన్స్ అంటూ ఆఫర్ చేస్తూ ఎస్సెమ్మెస్ లు పంపుతున్నాయి. ఫలానా పార్టీకి ఓటేయాలంటూ సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) పంపడమే కాదు.. ఆ మెసేజ్ ని మరో 15 మందికి ఫార్వర్డ్ చేస్తే, 551.49 రూపాయల బ్యాలెన్స్ ఉచితంగా పొందవచ్చంటూ ఆయా పార్టీలు ఊరిస్తున్నాయి.
ఈ తరహా సంక్షిప్త సందేశాలు చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని పలువురికి అందుతున్నాయి. అయితే, రూ.550 బ్యాలెన్స్ కోసమని ఇప్పటికే చాలామంది ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేసేశారు. తీరా చూస్తే వాళ్ల మొబైల్ కి ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ రాలేదు. దీంతో, రాజకీయ పార్టీల చేతిలో భంగపడ్డామని తెలిసి వారు ఇప్పడు మండిపడుతున్నారు.