: మునుగోడును సీపీఐకి కేటాయించడంపై పాల్వాయి ఆగ్రహం
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న మునుగోడును సీపీఐకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. సీపీఐతో పొత్తు వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టమని అన్నారు. రానున్న ఎన్నికల్లో మునుగోడు నుంచి తన కుమార్తె స్రవంతిని బరిలోకి దించే యోచనలో పాల్వాయి ఉన్నట్టు సమాచారం. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తే స్రవంతిని ఇండిపెండెంట్ గా పోటీ చేయించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడు స్థానాన్ని సీపీఐకి కేటాయించరాదంటూ పాల్వాయి నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు ఆందోళనకు దిగారు.