: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో వైకాపా నేత అరెస్టు


2000 ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ కేసులో కడప జిల్లా వైఎస్సార్సీపీ నేత గంగిరెడ్డిని డోన్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై డీఎస్పీ పీఎస్ బాబు డోన్ లో మాట్లాడుతూ, గత నెల 3న వెల్దుర్తి గోదాముల్లో దొరికిన 2000 ఎర్రచందనం దుంగలను వైఎస్సార్సీపీ నేత గంగిరెడ్డి అక్రమంగా నిల్వచేశారని, అందుకు గంగిరెడ్డిని అరెస్టు చేశామని అన్నారు. దీనిపై ఇప్పటి వరకు 32 మందిపై కేసులు నమోదు చేయగా, 12 మందిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ జెండా కట్టి తిరుగుతున్న వాహనాన్ని రిలయన్స్ దాభా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. దీనిని సీజ్ చేసినట్టు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News