: టీఆర్ఎస్ లోకి సీపీఐ నాయకురాలు చంద్రావతి
టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సీపీఐ ఖమ్మం జిల్లా వైరా శాసనసభ్యురాలు చంద్రావతి టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఖమ్మం నుంచి సీపీఐ సీటు నిరాకరించడంతో చంద్రావతి పార్టీని వీడినట్లు సమాచారం.