: దేశంలో కొత్త బ్యాంకు శాఖలకు డిమాండ్ పెరుగుతోంది: చిదంబరం


దేశంలో కొత్త బ్యాంకు శాఖలు స్థాపించాలని  ప్రజల నుంచి డిమాండు పెరుగుతోందని ఆర్ధికమంత్రి చిదంబరం అన్నారు. దీనిపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారుగ్రామాల్లో ప్రతి 10 కిలోమీటర్లకు ఒక బ్రాంచైనా లేకపోతే, ప్రజలు తమ ఖాతాలను ఎలా తెరవగలరని మంత్రి ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో 300 కొత్త బ్యాంకు శాఖలను మంత్రి చిదంబరం ఈ రోజు ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తమ సమీపంలో బ్యాంకు శాఖ లేకుండా ప్రజలు తమ ధనాన్ని ఎలా పొదుపు చేసుకోగలుగుతారని
ప్రశ్నించారు. అయితే గ్రామాల్లో, పట్టణాల్లో బ్యాంకు శాఖల ఏర్పాటుకు డిమాండు పెరగడం ఒక విధంగా ఆనందంగా ఉందని చెప్పారు.

కాగా, గత 2, 3 ఏళ్ల
 నుంచి దేశంలో సంవత్సరానికి 6వేల కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 2013-14లో అన్ని బ్యాంకులు పెద్దమొత్తంలో తమ శాఖలను ఏర్పాటు చేస్తాయని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఇదిలావుంటే ఒక్క యూపీలోనే 2,700 బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు. దీనివల్ల ముందు ముందు దాదాపు 10వేల నుంచి 12వేల బ్రాంచులను దేశంలో నెలకొల్పవచ్చని చిదంబరం  వెల్లడించారు.

  • Loading...

More Telugu News