: మొరాదాబాద్ లో ఆకట్టుకుంటున్న మోడీ రెస్టారెంట్
మోడీకి ఉన్న ఫాలోయింగ్ వ్యాపారుల ఆలోచనలకు సృజనాత్మకత పెంచుతోంది. తాజాగా మొరాదాబాద్ లో మోడీ పేరిట రెస్టారెంట్ వెలిసింది. నమో టీ స్టాల్స్ ఇప్పటికే ప్రజాదారణ పొందడంతో, రెస్టారెంట్ కూడా అంతే ఆదరణ పొందుతుందని రెస్టారెంట్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మోడీ మెనూ తయారు చేసిన నిర్వాహకులు, తినే ప్లేటు సహా రెస్టారెంట్ లో వాడే ప్రతి పరికరంపైనా మోడీ బొమ్మను ఉంచారు. చివరకు సర్వర్లు కూడా మోడీ మాస్కులు వేసుకునే అతిథులకు సేవలందించడం విశేషం.