: ఢిల్లీలో టీ కాంగ్రెస్ నేతలు.. టికెట్లపై దిగ్విజయ్ తో లాబీయింగ్


తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో తిష్ట వేశారు. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, డి.కె.అరుణ, కాసు కృష్ణా రెడ్డి తదితరులు హస్తినలో దిగ్విజయ్ నివాసం వద్ద క్యూ కట్టారు. ఈ రోజు సాయంత్రం పార్టీ తెలంగాణ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రతినిధి జానర్ధన్ త్రివేది విడుదల చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో 70 అసెంబ్లీ, 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నివాసంలో నేతలు లాబీయింగ్ మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News