: కూకట్ పల్లి పోలీసుల చేతికి చిక్కిన ఇద్దరు చోరులు
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్ బి) పీఎస్ పరిధిలో ఇద్దరు దొంగలను పోలీసులు ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి 16 తులాల బంగారం, 15 తులాల వెండి, 4 ల్యాప్ టాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు ప్రయాణిస్తున్న బైక్ ను సీజ్ చేశారు.