: చంద్రబాబుతో ముగిసిన బీజేపీ నేతల భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ నేతలు ప్రకాశ్ జవదేకర్, నరేష్ గుజ్రాల్ భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరి చర్చలు జరిగాయి. పొత్తు, సీట్ల సర్దుబాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో సాయంత్రం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే, సాయంత్రం చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని సమాచారం.