: నేను లోకల్ కాదు... మీ అధినేత్రి దేశీయే కాదు: అరుణ్ జైట్లీ


అమృతసర్ లోక్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. సిక్కు రాజకీయాలకు ముఖ్యంగా అకాలీదల్ రాజకీయాలకు కేంద్రమైన, సిక్కుల అతి పవిత్ర అమృతసర్ నియోజకవర్గం రాజకీయ విమర్శ, ప్రతివిమర్శలతో వేడెక్కుతోంది. గత రెండు పర్యాయాలు అకాలీదల్ మద్దతుతో గెలిచిన మాజీ క్రికెట్ దిగ్గజం, బీజేపీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్దూ పోటీ చేయకపోవడంతో బీజేపీ తరపున సీనియర్ లీడర్ అరుణ్ జైట్లీ బరిలో దిగారు. తొలిసారిగా ఆయన లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్నారు.

దీంతో ఆయనకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, పటియాలా మహారాజు అమరీందర్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించింది. వీరితో పాటు ఆప్ తరపున డాక్టర్ దల్జీత్ కూడా బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అరుణ్ జైట్లీ, అమరీందర్ సింగ్ మధ్యే ఉంది. అమరీందర్ సూటి విమర్శలు చేయడంలో దిట్ట, జైట్లీ దీటుగా స్పందించడంలో దిగ్గజం. దీంతో వీరి మధ్య మాటల యుద్ధం రక్తికడుతోంది.

అరుణ్ జైట్లీ లోకల్ కాదని, అతనికి ఇక్కడి సమస్యలపై అవగాహన లేదని అమరీందర్ విమర్శిస్తే... 'నేను కనీసం ఇండియన్, మీ పార్టీ అధినేత్రి ఏ దేశం నుంచి వచ్చిందని' అరుణ్ జైట్లీ సమాధానమిచ్చారు. 'ఒకరు ఢిల్లీకి చెందిన వారు, ఇంకొకరు పటియాలాకు చెందిన వారు. మీరిద్దరూ లోకల్ కాదు నేను లోకల్' అంటూ వారి విమర్శలకు సమాధానమిస్తున్నాడు ఆప్ అభ్యర్థి దల్జీత్ సింగ్.

  • Loading...

More Telugu News