: చంద్రబాబుపై కోపం లేదు: పురంధేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబుపై తనకు ఎలాంటి కోపం లేదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. తన మరిది చంద్రబాబును తానెప్పుడూ శతృవుగా చూడలేదని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీల పొత్తు ఇరు పార్టీలకు మంచిదే అని చెప్పారు. విజయవాడకు వచ్చిన పురంధేశ్వరిని... మీకు చంద్రబాబు అంటే కోపం కదా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు.