: టైటానియం కేసులో కేంద్రం సహకరించాలి: వీహెచ్
టైటానియం కేసులో నిజాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. అమెరికా దర్యాప్తు సంస్థలకు భారత ప్రభుత్వం సహకరించాలని సూచించారు. కేసీఆర్ నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదని... కుటుంబ స్వార్థం కోసమే ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడని ఆరోపించారు.