: కేవీపీపై స్పందించడానికి ఇష్టపడని రఘువీరా


ఇందిరాభవన్ లో బాబూ జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి జగ్జీవన్ రాంకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... 7, 8 తేదీల్లో అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని వెల్లడించారు. దళితుల కోసం పని చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని తెలిపారు. టైటానియం కుంభకోణంలో కేవీపీ పేరు రావడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... దీనిపై మాట్లాడటానికి రఘువీరా ఇష్టపడలేదు.

  • Loading...

More Telugu News