: అండర్ వేర్లో 2కేజీల బంగారాన్ని దాచి దొరికిపోయిన అమ్మడు


మహిళ కదా... లోదుస్తుల్లో దొంగ బంగారాన్ని పెట్టి కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బయటపడదామనుకుంది. కానీ, ఆమె ప్లాన్ పారలేదు. 2.14కేజీల బంగారాన్ని అక్రమంగా తీసుకొస్తున్న మహిళా ప్రయాణికురాలిని నిన్న ముంబై విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ముంబైలో అడుగుపెట్టిన జామా డాబిర్ అనే మహిళను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఆశ్చర్యపోవడం వారి వంతయింది. బంగారం కనిపించకుండా ఉండాలని ఆమె ఆరు జతల అండర్ వేర్లను వేసుకుంది. వాటి మధ్యలో బంగారు ఆభరణాలు దాచిపెట్టింది. వీటి విలువ రూ.54.2లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం లక్ష రూపాయల హామీపై ఆమెకు బెయిల్ మంజూరైంది.

  • Loading...

More Telugu News