: జగ్జీవన్ రాం 107వ జయంతి వేడుకలు


మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగ్జీవన్ రాం 107వ జయంతి వేడుకలను నిజామాబాదులో ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైల్వే కమాన్ వద్ద ఉన్న జగ్జీవన్ రాం విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎంపీ మధుయాష్కీతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రాం చేసిన కృషిని కలెక్టర్ ప్రద్యుమ్న వివరించారు.

  • Loading...

More Telugu News