: భారత దౌత్యవేత్త దేవయానికి కొత్త సమస్య!


వీసా మోసం కేసులో గతేడాది డిసెంబరులో అమెరికాలో అరెస్టయిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే ఇప్పుడు భారత్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె కొత్త సమస్యలో చిక్కుకోనుంది. ఆదర్శ్ స్కాం హౌసింగ్ కేసులో దేవయాని, ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడేలపై ఛార్జ్ షీటు దాఖలు చేయాలని సీబీఐ నిర్ణయించింది. కొన్ని రోజుల్లో అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేయనున్నారని సమాచారం.

తండ్రి ఉత్తమ్ ఇచ్చిన తప్పుడు ప్రమాణపత్రం ఆధారంగా ముంబయి ఓషీవోరాలో ఉన్న ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ప్రభుత్వ కోటా కింద దేవయాని ఫ్లాట్ ను పొందినట్లు ఇటీవల బయటపడిందని సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆదర్శ్ సొసైటీలో అక్రమంగా ఫ్లాట్ లు పొందిన, బినామి ద్వారా పొందిన వారిపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News