: వేధిస్తున్నాడంటూ దర్శకుడిపై సినీ నటి ఫిర్యాదు


సినిమా దర్శకులు, నటీనటుల మధ్య వివాదాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తమిళ సినీ దర్శకుడు రవికుమార్, నటి సుజిబాల మధ్య వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సుజిబాల తన భార్య అని, తమను విడదీసేందుకు కుట్ర జరుగుతోందని దర్శకుడు రవికుమార్ పత్రికలకెక్కారు. దీంతో సుజిబాల దర్శకుడు రవికుమార్ పై చెన్నైలోని వడపళని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

దర్శకుడు పి.రవికుమార్ కు తనకు వివాహ నిశ్చితార్థం అయిందని, అయితే అతనికి ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో... తాను ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నానని... ఇప్పుడు ఆయన పెళ్లి జరిగిందని, మామిడితోట కొనిచ్చానని అబద్దాలు చెబుతున్నారని, ఇటీవల యాక్టింగ్ స్కూల్ లో ఉన్న తనపై చేయి కూడా చేసుకున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేని రవికుమార్, తనను వేధింపులకు గురి చేస్తున్నారని, ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, దర్శకుడు రవికుమార్ ను విచారించనున్నారు.

  • Loading...

More Telugu News