: ముమ్మరంగా దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు విచారణ
హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు విచారణను ఎన్ఐఏ ముమ్మరం చేసింది. ఐఈడీ (అత్యాధునిక పేలుడు పదార్థం) పేలుళ్లకు సంబంధించి.. ఆర్ సీ 01, 2013 హైదరాబాద్ పేరిట చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద రెండు ఎఫ్ఐఆర్ లను నమోదు చేసింది. ప్రస్తుతం వీటిపైనే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రవాద సంస్థలకు చెందిన అనుమానిత వ్యక్తులే పేలుళ్లకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.