: గర్భం వల్ల హాలీవుడ్ నటికి మతిమరుపు!
ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ కథానాయిక కేట్ విన్ స్లెట్ తాను గర్భం దాల్చినప్పటి కష్టాలను వెల్లడించింది. 38 ఏళ్ల ఈ భామకు ముగ్గురు సంతానం. అయితే, ఇటీవల గర్భం సమయంలో తనకు మెదడులో కణాలు దెబ్బతిన్నాయని, దాంతో జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లు ఆమె తెలిపింది. అయితే, తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు కూడా తెలియజేసింది. బేబీ వల్ల ఈ పరిస్థితి ఎదురైందని, కోల్పోయిన కణాలు మళ్లీ పునరుత్ధానం చెందుతున్నాయని, తాను నటించిన చిత్రాలను గుర్తుంచుకోగలుగుతున్నాని చెప్పింది.