: 60కి పైగా కేసుల నిందితుడు అరెస్ట్
ఓ కరడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని గుంటూరు జిల్లా పొన్నూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై ఓ జంట హత్య కేసుతో పాటు 60కి పైగా ఇతర కేసులు ఉన్నాయి. ఇతగాడిని పట్టుకోవడం కోసం తమిళనాడు పోలీసులు గత తొమ్మిది నెలలుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా వాళ్లకు పట్టుబడకుండా చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఈ నేర శిఖామణి చివరకు మన పోలీసులకు దొరికిపోయాడు.