: నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న బీజేపీ అగ్రనేతలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆ పార్టీ అగ్రనేత అద్వానీ ఈ రోజు లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్ నాథ్ ఈసారి లక్నో నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అద్వానీ ఎప్పటివలే గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేయనున్నారు. నామినేషన్ వేసే సమయంలో అద్వానీ వెంట బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ, అద్వానీ కుమార్తె ప్రతిభ ఉంటారని సమాచారం.