: నగ్మా, హేమమాలినికి భద్రత పెంపు
ఒక ఎమ్మెల్యే ముద్దు, మరో యువకుడు ఒంటిపై చేయి వేయడం వంటి ఘటనల నేపథ్యంలో నటి, కాంగ్రెస్ తరపున లోక్ సభ అభ్యర్థి నగ్మాకు భద్రత పెంచారు. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి నగ్మా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నగ్మాతో పాటు హేమమాలిని కూడా అభిమానుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధుర లోక్ సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో అభిమానులు ఆమెకు దగ్గరగా రావడం చేస్తున్నారు. దీంతో హేమమాలినికి కూడా భద్రతను పెంచారు. వీరిద్దరితో పాటు జాన్సీ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఉమాభారతికి కూడా భద్రతను పెంచాలని ఎన్నికల సంఘం, ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.