: మోడీ వ్యతిరేకతే ఆయన విజయ మంత్రం


మోడీని ముక్కలు ముక్కలుగా నరుకుతానంటూ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక ఓ మంత్రం దాగున్నట్లుంది. సహరాన్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మసూద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయన కావాలనే కటువు వ్యాఖ్యలు చేసినట్లు కనబడుతోంది. సదరు వ్యాఖ్యల తర్వాత మసూద్ అరెస్టయ్యి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారమంతా మీడియా, ఎస్పీల కుట్రగా ఆయన పేర్కొన్నారు. మోడీ ఏం చేసినా తాము సమాధానం ఇచ్చి తీరుతామని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తారనే ధీమాతో మసూద్ ఉండడం విశేషం. సహరాన్ పూర్ లో 16లక్షల ఓట్లు ఉంటే, అందులో 40 శాతం ముస్లింలవే. మసూద్ సోదరుడు షెహజాద్ ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, మసూద్ మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ముస్లిం ఓట్లు సోదరుల మధ్య చీలడం ఆగిపోతుందని, మసూద్ కు లాభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News