: డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డ సినీ రచయిత


హైదరాబాద్ ఫిలిం నగర్ వద్ద పోలీసులు నిన్న రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో సినీ రచయిత బీవీయస్ రవి పట్టుబడ్డారు. అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతూ, పోలీసులకు దొరికిపోయారు. దీంతో రవిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇదే వాహనంలో ప్రయాణిస్తున్న సినీ హీరో రవితేజ, హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, తదితరులు మరో వాహనంలో వెళ్లిపోయారు. అయితే ఇదే మార్గంలో వచ్చిన రాజకీయ నేతల వాహనాలను పోలీసులు తనిఖీ చేయకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News