: మహిళ పాదాలు కడిగిన పోప్


కొత్త పోప్ ఫ్రాన్సిస్ తనదైన పంథాలో ముందుకెళుతున్నారు. చర్చి సంప్రదాయాలకు మానవీయత మేళవిస్తూ ఓ అరుదైన ఘటనకు చరిత్రలో స్థానం కల్పించారు. క్యాథలిక్ మత ఆచారాల ప్రకారం గుడ్ ఫ్రైడే ముందు వచ్చే పవిత్ర గురువారం సందర్భంగా ఇద్దరు యువతుల కాళ్ళు కడిగి వాటిని ముద్దాడారు. పురుషుల కర్మ దినంగా పరిగణించే ఆ పవిత్ర గురువారం నాడు ఇంత వరకు ఏ పోప్ కూడా మహిళల పాదాలను తాకిన సందర్భాలు లేవు.

ఈ నేపథ్యంలో కొత్త పోప్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టయింది. రోమ్ లో ఓ బాల నేరస్తుల ఆవాస కేంద్రాన్ని సందర్శించిన పోప్ ఇద్దరు యువతుల కాళ్ళు కడగడంతో పాటు వాటిని చుంబించారు. దీంతో సనాతనవాదులు సైతం పోప్ చర్యను స్వాగతించారు. ఆయన కలుపుగోలుతనాన్ని కీర్తించారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ, శిలువ వేసే ముందు యేసు క్రీస్తు కూడా ప్రేమాయమ సేవలో భాగంగా శిష్యుల పాదాలను కడిగిన వైనాన్ని గుర్తు చేశారు. 

  • Loading...

More Telugu News