: 'అంధేరా'ప్రదేశ్ గా మారిపోయింది : కిషన్ రెడ్డి


అన్ని రకాల పన్నులు పెంచుతూ కిరణ్ కుమార్ రెడ్డి పన్నుల ముఖ్యమంత్రిగా మారారని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు వేసే అధికారం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం అంధేరా ప్రదేశ్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. 

వేసవి ప్రారంభంలోనే అన్ని చోట్లా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందనీ, రానున్న రెండు నెలల్లో పరిస్థితి ఊహించుకుంటే భయమేస్తోందనీ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మంచినీటికంటే మద్యమే సులభంగా దొరుకుతుందని కిషన్ రెడ్డి చురక వేశారు. 

  • Loading...

More Telugu News