: ఇస్రో బృందానికి అభినందనలు తెలిపిన గవర్నర్
పీఎస్ఎల్ వీ -సి 24 ప్రయోగం విజయవంతమవడంతో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 5.14 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఈ వాహకనౌక సమాచార వ్యవస్థకు తోడ్పడే ఐఆర్ఎన్ఎస్ఎస్ 1బి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.