: జ్వాల, అశ్విని సూపర్ జోడీ అంటున్న షట్లర్లు


భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ జోడీ గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్పలను ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ టూ షట్లర్లు క్రిస్టినా పెడెర్సన్, కెమిల్లా రైటర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆటలో జ్వాల ‘బ్రెయిన్’ అయితే, అశ్విని ‘మెషీన్’ అని వారు అభివర్ణించారు. ‘‘ఆటను అర్థం చేసుకోవడంలో జ్వాల మేటి. అశ్వినితో కలసి ఆమె కొన్ని ఉత్తమ ఫలితాలు సాధించింది. జ్వాల ఆటతీరును వెంటనే అర్థం చేసుకుంటుంది. అశ్విని ఓ యంత్రంలా దూకుడుగా వ్యవహరిస్తుంది. అందువల్లే డబుల్స్ లో వీరు మంచి జోడీ కాగలిగారు’’ అని కెమిల్లా చెప్పింది.

హైదరాబాదులో 2009లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో కెమిల్లా థామస్ లేబోర్న్ తో లిసి మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. భారత్ ఓపెన్ బ్యాడ్మింటన్ విమెన్స్ డబుల్స్ లో కెమిల్లా, క్రిస్టినా నెంబర్ వన్ సీడ్ గా బరిలోకి దిగుతున్నారు. జ్వాల, అశ్విని జోడీ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని, అయితే ఆటలో ఎత్తుపల్లాలు సాధారణమేనని కెమిల్లా చెప్పింది.

  • Loading...

More Telugu News