: హామీలిచ్చి కేసీఆర్ మాట తప్పారు: రాజనర్సింహ
దళితులకు, మైనారిటీలకు హామీలిచ్చి కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనరసింహ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే కూలిన గడీలను నిర్మించడం కాదని, కాంగ్రెస్ తోనే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమని ఆయన అన్నారు. మోసగాడి చేతిలో తెలంగాణ పెడితే నట్టేట ముంచుతాడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతం కేసీఆర్ కు జాగీరుగా మారిందని, కుమారుడికి కరీంనగర్, కూతురికి నిజామాబాద్, అల్లుడికి మెదక్, ఇతర జిల్లాలను కట్టబెట్టాడని రాజనరసింహ ఆరోపించారు.