: టీఆర్ఎస్ ది వాపో, బలుపో ప్రజలే తేలుస్తారు: పొన్నాల


కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో ప్రజలను కేసీఆర్ మోసం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ అల్లాఉద్దీన్ అద్భుత దీపంలాంటిదని అన్నారు. టీఆర్ఎస్ ది బలుపో, వాపో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని చెప్పారు. తెరాసకు అభ్యర్థులు కరవైతే... అరువుకు తెచ్చుకున్నారని అన్నారు. భూకబ్జాదారులకు, తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చారని పొన్నాల ఆరోపించారు.

  • Loading...

More Telugu News