: నటి ఖుష్బూ ఇంటిపై దుండగుల దాడి


చెన్నైలోని సినీ నటి, డీఎంకే నేత ఖుష్బూ ఇంటిపై ఈ మధ్యాహ్నం గుర్తు తెలియని 20 మంది వ్యక్తులు దాడి చేశారు. వెంటనే ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు రక్షణ కల్పించారు. కొన్ని రోజుల కిందట ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ, డీఎంకే  అధ్యక్షుడు స్టాలిన్ అయినా అవ్వచ్చు లేదా మరెవరైనా కావచ్చనీ , ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ వ్యవహారాన్ని పార్టీ జనరల్ కౌన్సల్ నిర్ణయి స్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుంచి ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆ పార్టీ కార్యకర్తలే ఇప్పుడు దాడులు చేసివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతకుముందు డీఎంకే అధినేత కరుణానిధే తన తదనంతరం  ముఖ్యమంత్రిగా స్టాలిన్ బరిలో ఉంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News