: అభివృద్ధి చేసే శక్తి టీడీపీకే ఉంది: చంద్రబాబు


అభివృద్ధి చేసే శక్తి తమకే ఉందని అందరూ భావిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అందుకే అనేక మంది టీడీపీలో చేరుతున్నారని ఆయన అన్నారు. టీడీపీలో కొత్తగా చేరిన వారినుద్దేశించి చంద్రబాబు నివాసంలో మాట్లాడుతూ... వెనుకబడిన వర్గాలే టీడీపీకి వెన్నెముక అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని చంద్రబాబు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, నిరుద్యోగం, ధరలు బాగా పెరిగాయని... కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని బాబు అన్నారు.

  • Loading...

More Telugu News