: రేవ్ పార్టీ చేసుకున్న 46 మంది విద్యార్థుల అరెస్ట్
పుట్టిన రోజు వేడుక పేరుతో వాళ్లు మందేసి, చిందేశారు. అయితే, వాళ్లు చేసుకొన్నది మామూలు పార్టీ కాదు, రేవ్ పార్టీ! దాంతో రేవ్ పార్టీ పేరుతో రెచ్చిపోయిన ఆ 46 మంది కళాశాల విద్యార్థులను పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు. పుణెలోని లోనవాల హిల్ స్టేషన్ ప్రాంతంలోని గోల్డ్ వ్యాలీలో గురువారం అర్ధరాత్రి ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ పోలీసులు రైడ్ చేసి కాలేజీ కుర్రాళ్లను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో 20 మంది విద్యార్థినులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.