: విదేశాల్లోని నల్లధనాన్ని 100 రోజుల్లో వెనక్కి తెస్తాం: రాజ్ నాథ్


నరేంద్ర మోడీ ప్రధాని అయిన వెంటనే విదేశాల్లో మూలుగుతున్న రూ. 5.5 లక్షల కోట్ల నల్లధనాన్ని 100 రోజుల్లో దేశానికి తీసుకొస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పించలేక పోయిందని విమర్శించారు. యూపీఏ పాలనలో ధరలు ఆకాశాన్నంటాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. గత ఏడాది భారత జవాన్లను పాక్ హతమార్చిందని... జవాన్ల రక్షణను యూపీఏ గాలికొదిలేసిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News