: యూపీఏ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోయాయి: రవి శంకర్ ప్రసాద్
యూపీఏ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్థిక మందగమనానికి యూపీఏ పాలన తీరే కారణమని అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... యూపీఏ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయని ఆయన చెప్పారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు యూపీఏ ప్రభుత్వం సుముఖంగా లేదని ఆయన తెలిపారు.