: గెలిచే సీట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులకే: ఎర్రబెల్లి
అరవై తొమ్మిది శాసనసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంపై టీడీపీ స్పందించింది. గెలిచే సీట్లన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి, ఓడిపోయే సీట్లన్నీ విద్యార్థులకు, ఉద్యమకారులకు ఇచ్చారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టడమే ఆయన ఆశయమని అందుకే ఇలా మోసం చేశారని మండిపడ్డారు. మాటమీద నిలబడటం కేసీఆర్ కు తెలియదన్న ఎర్రబెల్లి తొలి సీఎం దళితుడని చెప్పి మాట మార్చింది ఆయన కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు అమ్ముడుపోయింది కూడా వాస్తవం కాదా అని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిలదీశారు. ఆస్తులు పెంచుకోవడమే పనిగా పెట్టుకున్న ఆయన్ను నమ్మే స్థితిలో ఎవరూ లేరన్నారు.