: విజయవాడలో మూడు పెట్రోల్ బంకులు సీజ్
విజయవాడలో మూడు పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మూడు పెట్రోల్ బంకులను అధికారులు ఈరోజు సీజ్ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్ నిర్వహించిన తనిఖీల్లో పడవల రేవు వద్దనున్న విజయలక్ష్మి ఎంటర్ ప్రైజెస్, ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ సమీపంలోని బాలాజీ ఫిల్లింగ్ స్టేషన్, చుట్టుగుంట వద్దనున్న లక్ష్మీ ఆయిల్ కంపెనీ పెట్రోల్ బంకులు ఓ రాజకీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని పసుపు రంగు స్లిప్ చూపిన వారికి పెట్రోలు పోస్తున్నట్లు నిర్థారించారు. ఈ పెట్రోల్ బంకుల నుంచి ఐదు వేలకు పైగా స్లిప్పులను వారు స్వాధీనం చేసుకుని, బంకులను సీజ్ చేశారు.