: సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సచివాలయాలతో పాటు కమిషనరేట్లు, డైరెక్టరేట్ల భవనాల విభజనపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అయితే, గవర్నర్ సలహాదారు ఏఎన్ రాయ్ ఈరోజు సచివాలయంలోని అన్ని బ్లాక్ లలో తిరిగి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కొత్తగా కేటాయించే హెచ్ బ్లాక్ ను ఆయన పరిశీలించారు.