: హైదరాబాదులో రూ.3 కోట్లు పట్టుబడ్డాయ్
హైదరాబాదులోని భరత్ నగర్ కాలనీ వద్ద ఈరోజు ఉదయం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న మూడు కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించారు. ఈ సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నగదును ఆదాయపన్ను శాఖకు అప్పగించనున్నట్లు వారు వెల్లడించారు.