: సినిమాలో ‘ఒక్క ఛాన్స్’ ఇస్తానంటూ యువతులకు మాయమాటలు, స్టంట్ మాస్టర్ అరెస్ట్
‘‘సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే సినిమాలో ఒక్క ఛాన్స్ ఇస్తాను’’ అంటూ యువతులను మోసం చేసి వ్యభిచారంలోకి దింపుతున్న స్టంట్ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరువొత్తియూరులో సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తామని ఓ ముఠా యువతులను వ్యభిచార కూపంలోకి లాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
పోలీస్ కమిషనర్ జార్జి ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైం బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ నల్లశివం, డిప్యూటీ కమిషనర్ జయకుమార్ నేతృత్వంలో ఇన్ స్పెక్టర్ గోపీనాథ్ బృందం నిఘా ఉంచింది. వడపళనిలోని ఒక స్టూడియో సమీపంలో ఉన్న విలాసవంతమైన ఇంటిలో తనిఖీ చేశారు. యువతులతో అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న సినీ స్టంట్ మాస్టర్ బాంబే కుమార్ ను, అతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ భవంతిలో ఉన్న నలుగురు యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు.