: సార్వత్రిక ఎన్నికల్లో సిరాగుర్తు కుడిచేతి వేలికి వేయండి: ఈసీ
ఈసారి ఎన్నికల్లో సిరాగుర్తు కుడిచేతి వేలికి వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సిరాగుర్తు ఏ చేతికి వేయాలన్న దానిపై సీఈసీ స్పష్టత ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్లకు కుడిచేయి చూపుడు వేలిపై సిరాగుర్తు వేయాలని అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.