: నాంపల్లి కోర్టులో సత్యం స్కాం కేసుపై విచారణ
హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో సత్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. రామలింగరాజు తదితరులు ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో రామలింగరాజుతో పాటు కొంతమంది డైరెక్టర్లు కూడా జైలుశిక్ష అనుభవించారు. ఇక కొన్ని నెలల కిందట ఇదే స్కాంలో పలువురికి కోర్టు శిక్ష విధించిన విషయం విదితమే.