: నేడు నింగికెగరనున్న పీఎస్ఎల్వీ-సీ24
అంతరిక్ష రంగ చరిత్రలో భారత్ మరో మైలు రాయిని చేరుకోవడానికి సమయం ఆసన్నమైంది. పీఎస్ఎల్వీ-సీ24 రాకెట్ ఈ సాయంత్రం 5.14 గంటలకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నింగికెగరనుంది. భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్ఎన్ఎస్ఎస్)-1బీని పీఎస్ఎల్వీ వాహకనౌక అంతరిక్షంలోకి తీసుకెళుతోంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ బుధవారం ఉదయం ప్రారంభమైంది.
ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ నిన్న సాయంత్రం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. రాకెట్ ప్రయోగానికి ముందు ఈ గుడిలో పూజలు నిర్వహించడం ఇస్రోకు ఆనవాయతీగా వస్తోంది.